శుక్రవారం, డిసెంబర్ 27, 2013

వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ ...

,”బాబుగారు! మీరు ఏమి చదువుకున్నారు?”అని అడిగినప్పుడు చాలా సిగ్గుపడ్డాను.యెందుకంటే,ఆ అ’గణిత’ మేధావి ముందు మనం నిరక్షురలం క్రింద లెక్క వేసుకొనవచ్చు.”మీరు ఏ రోజు పుట్టారు బాబు గారు?”అని అడిగారు. దానికి నేను సమాధానంగా,”శ్రీ వికృతి నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు,రోహిణీ నక్షత్రంలో జన్మించాను.”అని చెప్పాను.వెంటనే రెండు నిముషాలలోపే,”అంటే, 22 -12 -1950 న,మంగళవారం జన్మించారు” అని చెప్పి ... 


బుధవారం, డిసెంబర్ 18, 2013

ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ...

సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ...

శనివారం, డిసెంబర్ 14, 2013

జంతువులను ఆడించినట్లు ...

 కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి ఎలాంటి వ్యవస్థ ఉండాలి? అప్పులు-ఆదాయాల పంపకం ఎలా చేయాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేసుకోవాలి? యువత విద్యా, ఉపాధి అవకాశాలెలా పెంచాలి?

ఆదివారం, నవంబర్ 17, 2013

బత్తుల ప్రసాద్ కథ 'కుప్పకట్లు'

అవదాన్లయ్య ఈనికి నేనేమి వైద్యం శెప్పినానబ్బ అని కాసేపు ఆలోశన జేసి, ‘ఇంతకు ఏమి వైద్యం శెప్పినానురా’ అనడిగినాడు. ‘అదేంది సోమీ, వారం కిందట నీకాడికి వచ్చి కండ్లు మసకలు మసకలుగా కనపడ్తాండాయి సోమి అనంటే… పొయి జిల్లేడుపాలు పోసుకో పోరా అని జెప్తివి మరిసిపోతివా’ అని నారయ్య జెప్తా వుంటే అవదాన్లయ్య నోరెళ్లబెట్టి సూచ్చాండడు.
‘ఏందిరా నిజ్జంగా జిల్లేడుపాలు కండ్లల్లో పొడ్సుకున్నెవా’....

శుక్రవారం, నవంబర్ 15, 2013

బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట!

సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట.


బుధవారం, నవంబర్ 06, 2013

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

 హైదరాబాదు ఆదర్శనగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడు స్టేట్ మంత్రిహోదా వుండేది. ఆయనను కేబినేట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ...

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవుని కడప రధోత్సవ వైభవం

 కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప వేంకటేశ్వరుని రధోత్సవ వైభవాన్ని ఇలా కీర్తించాడు….
కన్నులపండుగలాయ గడపరాయనితేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు

గురువారం, అక్టోబర్ 31, 2013

అద్వితీయ ప్రతిభాశాలి

పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో తక్కిన రచయితలకూ ఆయనకూ అటువంటి భేదం ఉంటుంది. మర్రిచెట్టుకూ, తక్కిన వృక్షాలకూ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ప్రౌఢిలో, విస్తీర్ణతలో, ఆయనకూ ఇతర కవులకూ అటువంటి వ్యత్యాసం వుంటుంది. 

సోమవారం, అక్టోబర్ 28, 2013

హైదరాబాద్ నగరం ఎవరికి కావాలి?

సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన నేలలు, నదులు, అడవులు, అధిక వర్షపాతం వంటి సహజ వనరులతో పాటు విద్య, వైద్యం వంటి మానవవనరులు, నీటి పారుదల వంటి మౌలికసదుపాయాలు పుష్కలంగా కలిగి విరాజిల్లుతున్న కోస్తాంధ్ర ఎక్కడ? రాళ్ళు, రప్పలు, మెట్ట భూములు, అల్ప వర్షపాతం, కరువుకాటకాలతో పాటు అవిద్య, అరకొర మౌలిక సదుపాయాలు కలిగి వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న రాయలసీమ ఎక్కడ?

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

'ప్రపంచానికి రాయలసీమ చాలా కానుకలను ప్రసాదించింది' - రావూరి భరద్వాజ

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది.

మంగళవారం, అక్టోబర్ 22, 2013

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. 

శనివారం, అక్టోబర్ 19, 2013

వదినకు ఒకసరి - జానపద గీతం

వదినకు ఒకసరి
బిందెకు బిగసరి
బంగారు జడ కుచ్చుల మా వదిన
 
తాటి తోపులో
పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన
తన నడుముకు కట్టమంటది మా వదిన

గురువారం, అక్టోబర్ 17, 2013

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ ….

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది?
కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది.
చాలా సంవత్సరాల క్రితం…
ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.

శనివారం, అక్టోబర్ 12, 2013

వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలా?

1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి కేటాయింపులన్నీ మిగులు జలాలతో ముడిపడి ఉన్నందున, వాటి కోసం కోస్తా, తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాల మీద సీమ ఆధారపడి ఉండాలని విద్యాసాగర్‌రావు అభిప్రాయంగా కనిపిస్తోంది.

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

తిరిగొచ్చిన ఆది

జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. గతంలో కడప ఉప ఎన్నికల సమయంలో ఆయన జగన్ కే మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ అదికారంలో ఉండడంతో తనకు వ్యక్తిగతం గా వచ్చే ఇబ్బందులను...

సోమవారం, అక్టోబర్ 07, 2013

ఆంధ్రప్రదేశ్ లోనే ఎత్తైన జలపాతం

నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే... 

శనివారం, అక్టోబర్ 05, 2013

మా ‘గండికోట’కు పురస్కారం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా  కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని....

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

సీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదా!

రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదని చెప్పడం మూర్ఖత్వం. కృష్ణా జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా- పెన్నా ప్రాజెక్టులు అటకెక్కించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తామని చెప్పిన సిద్దేశ్వరం గాలిలో కలిసిపోయింది. బళ్లారిని రాయలసీమ వాసులు కోల్పోయారు. ..

గురువారం, అక్టోబర్ 03, 2013

జగన్ కోసం తెదేపా ఎన్నికల ప్రచారం చేసి పెడుతోందా?

హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జగన్ కు ప్రచారం చేసి పెట్టి తద్వారా వైకాపాకు మరిన్ని ఓట్లు పడేలా కృషి చేయాలని కాకలు తీరిన చంద్రబాబు గారి నేతృత్వంలోని తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మాకు తెలుసు తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం విని విస్మయానికి గురవుతారని....

బుధవారం, అక్టోబర్ 02, 2013

జానపదబ్రహ్మ మునెయ్య - పాటలు

పచ్చశత్రీ  సేతబట్టి...
కిర్రు సెప్పులేసుకోని ...
కట్టమీద  పోతా వుంటేరో ...

శనివారం, సెప్టెంబర్ 28, 2013

జగన్‌కు షరతులతో కూడిన బెయిల్

  • రూ.2 లక్షల విలువైన పూచీకత్తు, అంతే మొత్తానికి సమానమైన ఇద్దరు వ్యక్తుల వ్యక్తిగత పూచీకత్తులను సమర్పించాలి.
  • కోర్టు అనుమతి లేకుండా నగరం విడిచి వెళ్లకూడదు. కేసులో వాయిదాలకు తప్పనిసరిగా హాజరు కావాలి.
  • దర్యాప్తునకు ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ ఆటంకాలు కల్పించినా, షరతులను ఉల్లంఘించినా… 

బుధవారం, సెప్టెంబర్ 25, 2013

నిజాం మనువడి దారుణ హత్య

నిజాం చనిపోవడంతో అతని ఐదవ కొడుకు నాసిర్జంగ్ (మీర్ అహ్మద్ అలీ ఖాన్) దక్కన్ పాలకుడయ్యాడు. ఈ నిర్ణయం రుచించని నిజాం ఉల్ ముల్క్ మనవడు (నిజాం కుమార్తె ఖైరున్నిసా బేగం, బీజాపూర్ సుబేదార్ తలిబ్ ముహిద్దిన్ ముతవస్సిల్ ఖాన్ ల కుమారుడు) ముజఫర్ జంగ్ ఎలాగైనా ....

సోమవారం, సెప్టెంబర్ 23, 2013

కాలం ఖర్మం కలిసి రాక కాలగర్భంలో కలిసిపోయారు

కడపలో నటులకు ఏనాడూ కొరత లేదు. నాటక కలోద్దారణకై తమ జీవితాలను అంకితం చేసి అందులో పరాకాష్ట పొందిన వారూ లేకపోలేదు. కాని కాలం ఖర్మం కలిసి రాక ఎందరెందరో మహానటులు కాలగర్భంలో కలిసిపోయారు. మరికొందరు చావు బతుకుల మధ్య మిలమిలా మెరుస్తున్నారు...

శుక్రవారం, సెప్టెంబర్ 20, 2013

ఒక రాజకీయ నాయకుడిగా......

నీటి యుద్ధాలు’ నిజమేనా? (సెప్టెంబర్ 9, ఆంధ్రజ్యోతి) ఆర్. విద్యాసాగర్ రావు ప్రశ్నించారు. ఆయన తన వ్యాసాన్ని ఒక సాగునీటి నిపుణునిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా రాశారు. దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఆ వ్యాసంలోని రెండవ పేరాలో ఆయన వాడిన పదజాలమే. ఇది విద్యాసాగర్‌రావు పక్షపాత ధోరణికి....

బుధవారం, సెప్టెంబర్ 18, 2013

గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్నది ఊటుకూరు

కైఫీయత్తులో మరో పట్టాభిరామకవి దొరుకుతున్నాడు. ఆయన క్రీ.శ. 1700 ప్రాంతంలో జీవించాడు. కడప జిల్లాకు చెందిన ఊటుకూరు కైఫీయత్తులో ఈ సమాచారం ఉంది. మట్ల తిరువేంగళనాథరాజు ఉరఫ్‌ అప్పయ్యరాజు సాహిత్యాభిమాని. కోడూరు సమీపంలోని ఎర్రగుంట్లకోట కేంద్రంగా పొత్తపినాడు పులుగులనాడు ప్రాంతాల్ని పాలిస్తూ ఉన్నాడు. ఊటుకూరుకు తూర్పుగా ఉన్న రామసముద్రం అనే గ్రామాన్ని పట్టాభిరామ కవికి గ్రాస గ్రామంగా ఇచ్చాడు.

సోమవారం, సెప్టెంబర్ 16, 2013

తెలంగాణ మిత్రులు ఇచ్చే అర్థం ఇదేనా?

రాయలసీమ సాగునీటి సమస్యల గురించి నిష్ఠుర నిజాలు వెల్లడించినందుకు ఆయనను అభినందించాలో లేక తన తెలంగాణ మిత్రులకు సంజాయిషీ చెప్పుకుంటూ రాయలసీమ పట్ల తన సానుభూతిని ఉదాసీనతలోకి మార్చుకుంటున్నందుకు విచారపడాలో...

పులివెందుల జేఎన్‌టీయు ఇంజనీరింగ్ కళాశాలకు ప్రత్యేక హోదా

అటానమి స్టేటస్‌తో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు...
విద్యార్థులకు ఉపాధి కల్పించే పాఠ్యాంశాలు చేర్చే అవకాశం,  ఆధునిక కాలనుగుణంగా సిలబస్‌లో మార్పులు చేసే అవకాశం, సంవత్సరిక పరీక్షల ప్రశ్న పత్రాలను ఇక్కడే తయారుచేసుకునే అవకాశం...

బుధవారం, సెప్టెంబర్ 11, 2013

చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ

"రాష్ట్రం విభజించినా సీమాంధ్ర ప్రాంతాలు కలిసే ఉంటాయి కనుక 'ఇచ్చిపుచ్చుకోవడం' అక్కడే జరగాలి." అని తీర్మానించడం రావు గారికే చెల్లింది. సీమ వాసులు ఎలా ఉండాలనేది వీరే నిర్ణయిస్తారు. ఇది చేతగాని నాయకులను నమ్ముకున్న మా ఖర్మ.

సోమవారం, సెప్టెంబర్ 09, 2013

భాగవతం పుట్టింది ఒంటిమిట్టలో..!

పోతన భాగవతంలో దష్టమైన భాగాలను పూరించిన గంగన, సింగన, నారయ్యలు వరంగల్లు ప్రాంతం వారు. వారు 4, 5, 10, 11, 12 స్కంధాలు ఆది నుంచి అంతం దాకా పూరించారు. విరూపాక్షుని సామదాన భేదాలకు లొంగని పోతన ఒంటిమిట్టలో నిలువ లేక పోయాడు. ఒంటిమిట్ట నుండి బండ్లలో తన వస్తువులు సర్దుకొని ఓరుగల్లుకు బయలుదేరినాడు...

శనివారం, సెప్టెంబర్ 07, 2013

విభజన జరిగితే ఎడారే

రాయలసీమ సాగునీటి అవసరాలను తీర్చడంలో శ్రీశైలం ప్రాజెక్టు ఆయువుపట్టు లాంటిదన్నారు. విభజన జరిగితే కృష్ణా నదిలోని మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్న తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజెక్టులకు నికర జలాలు లభించక సీమ ఎడారిగా మారుతుందని ....

శనివారం, ఆగస్టు 31, 2013

విభజన తర్వాత రాయలసీమ పరిస్థితి …

నిజమే.తెలంగాణ ఏర్పాటు తర్వాత కృష్ణాజలాల వినియోగం మొత్తం కేంద్ర బోర్డు అజమాయిషీలోకి వెళుతుంది కాబట్టి.. రాయలసీమ ప్రాజెక్టులకు కేటాయించిన నికర జలాలు మినహా అదనంగా మిగులు జలాల లభ్యత కూడా కష్టమే ....

బుధవారం, ఆగస్టు 28, 2013

ఆనాడే చెన్నయ్ భవిష్యం చెప్పిన ఆ రెండు పద్యాలు

ఢిల్లీ, కలకత్తా, బొంబాయి వంటి నగరాల చరిత్రలు వందల వేల సంవత్సరాలవి కాగా మద్రాసు లేదా చెన్నపట్టణం అని పిలువబడుతూ ఉండిన నేటి ‘చెన్నయ్‌’ నగర చరిత్ర క్రీస్తు శకం పదిహేడో శతాబ్దం మధ్య కాలం నుంచే మొదలయిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అయినా గువ్వల చెన్న శతకంలోని ఈ రెండు పద్యాలు...

సోమవారం, ఆగస్టు 26, 2013

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా
మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1
శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని
కోపామునేసి కొట్టగా...
పూర్తి  వివరాలు

వాళ్ల గులాములుగా బ్రతాకాల్సి వస్తుందా!

ప్రత్యేక రాయలసీమ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయకపోతే మేమంతా సర్కార్‌ ఆంధ్ర వాళ్లక్రింద గులాములుగా బ్రతాకాల్సి వస్తుంది. అసెంబ్లీలో రాయలసీమ కు చెందిన ఎమ్మెల్యేలు 53 మంది మాత్రమే ఉంటారని, అదే కోస్తా ఆంధ్రలో 112 మంది ఎమ్మెల్యే లు...

ఆదివారం, ఆగస్టు 25, 2013

అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

కోకట గ్రామాద్యనేకాగ్రహారాల్లో రాయలు కోకటం గ్రామాన్ని మొదట పెద్దనకు సమర్పించాడు. కళింగం మీదికి దండెత్తిన సమయంలో వైశాఖ పూర్ణిమ చంద్రగ్రహణ సమయాన కోకటం గ్రామంలోని కొంతపొలాన్ని కోకటంలోని సకలేశ్వరునికి...

సలీం అలీ ఉద్విగ్నం

రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఐతన్న అనే గొర్రెల కాపరి అడవికి వేటకు వెళ్ళేవాడు. అతనికి 1986 జనవరి 5వ తేది రాత్రి అడవిలో వేటాడుతుండగా కొత్తరకం పక్షుల జంట కనబడింది. ఐతన్నకు వెంటనే ఆలోచన తట్టింది. శాస్త్రవేత్తలు, అధికారులు వెదుకుతున్న పక్షి ఇదేనని భావించాడు. పోస్టర్లలోని పోటోతో ఈ పక్షులను పొల్చుకుని నిర్థారించుకున్నాడు. ఆ పక్షుల జంటలో ఓ పక్షిని అతి కష్టంమీద పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు. 

శనివారం, ఆగస్టు 24, 2013

అదేనా పేదరికం అంటే?

యువరాజా వారు నిద్ర లేచారు. అదేంటోగానీ రాత్రుళ్ళు ఎంతసేపు నిద్రపోయినా వారికి లేచేసరికి బద్ధకంగానే ఉంటుంది. బలవంతాన లేచినా రోజంతా ఏం చెయ్యాలో తోచిచావదు. నాన్నగారు పోయిన తర్వాత ఒక ప్రయోగం చేసి చేతులు కాల్చుకున్నప్పట్నించి నోరూవాయీలేనివాడొకణ్ణి ప్రధానమంత్రిగా పెట్టుకుని ...

సోమవారం, ఆగస్టు 19, 2013

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ అనేది ఏమిటి?

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని ప్రభుత్వం ఎందుకు పెంచింది?

ప్రభుత్వం తనంతట తానుగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచిందా?

పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ విస్తరణపై తెలంగాణా, కోస్తాంధ్ర ప్రాంత నేతల అభ్యంతరం ఏమిటి?

ఆంధ్రప్రదేశ్ లో పోతిరెడ్డిపాడు ప్రాజెక్టును మాత్రమె ఈ రకంగా విస్తరించారా?

శనివారం, ఆగస్టు 17, 2013

సీమ పై విషం కక్కిన మేధావి

నికర జలాల కేటాయింపు పొందిన సాగర్ ఆయకట్టు, కృష్ణా డెల్టాలను గురించి వీరి బాధ చూడండి. అంతేనా పనిలో పనిగా ప్రభుత్వాన్నీ తిట్టి పోశారు – విద్యుత్తు గురించి. వారికి వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకోకుండా దానికే ఫిక్సయిపోయి – మిగులు జలాలు లేదా వరద జలాల మీద ఆధారపడ్డ సీమ వాసులు దౌర్జన్యం, దోపిడీ చేశారు అంటారు. 
ఇదీ మేధావి గారి డొల్ల వాదన. ఇదంతా తెలంగాణా ప్రజల మనస్సులో సీమ వాసులపై విషం నింపటం .... 

గురువారం, ఆగస్టు 15, 2013

ఉద్యమ బాట పట్టవలసినది రాయలసీమే...

1951లో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి రాజగోపాలాచారి ఆధ్వర్యంలో కృష్ణా- పెన్నార్‌ ప్రాజెక్ట్‌ రూపొందింది. కేంద్ర ప్రణాళిక సంఘం అనుమతి కూడా వచ్చింది. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 12 లక్షల ఎకరాలకు సాగు నీరు అందేది. 

సీమవాసులకు చుక్క నీరు అందని విధంగా 1954లో రాయలసీమకు దిగువ భాగాన ‘నాగార్జునసాగర్‌’గా నిర్మించారు. 23 లక్షల ఎకరాలకు సాగునీరు తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలలో అందుబాటులోకి వచ్చింది. రాయలసీమకు మొండిచెయ్యి .... 

మంగళవారం, ఆగస్టు 13, 2013

శృంగార కరుణ హాస్యాల సమ్మేళనం

”గాథా త్రిశతి’’ శృంగార కరుణ హాస్యాల సమ్మేళనం. అలంకార శాస్త్రవేత్తలు ఆశించే ధ్వనికి రసాలంకారాలకు ఈ గాథలు మకుటాయమానంగా నిలుస్తాయి అనడంలో ఎట్టి సందేహమును లేదు.

ఆదివారం, ఆగస్టు 11, 2013

‘దేశం నడిబొడ్డున విగ్రహం పెట్టి రోజూ పూజలు చేసేవాళ్లం’

 డా. లక్కోజు సంజీవరాయశర్మ అంకెల ఆకాశంలో అమావాస్య చంద్రుడు. ప్రపంచంలో ఆరువేల గణితావధానాలు చేసిన ఏకైక మేధావి!

శనివారం, ఆగస్టు 10, 2013

కమ్యూనిస్టు ఉద్యమ ఆణిముత్యం

"గాడ్‌ ఈజ్‌ క్రియేటెడ్‌ బై మాన్‌” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న ధవళ వస్త్రాల్లో ఉన్న రాజకీయ సన్యాసి కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వరరెడ్డి.

శుక్రవారం, ఆగస్టు 09, 2013

గురువారం, ఆగస్టు 08, 2013

మత్తులో జోగిన సీమ ముఖ్యమంత్రులు

అధికారం  లేదా పదవి అనేది మత్తు మందులా పని చేస్తుంది. ఆ మత్తులో జోగే వాడు దాని నుంచి బయటకు రావటానికి సుతరామూ ఇష్టపడడు. అంతేకాదు ఆ మత్తు కోసం దేన్నైనా పణంగా పెడతారు వాళ్ళు.

బుధవారం, ఆగస్టు 07, 2013

ఇక సీమాంధ్ర కాంగ్రెస్ విన్యాసాలు

నెహ్రూ వారసులు మొదలెట్టిన ఆట చివరి అంకానికి చేరింది. మూలన పడిన నిర్ణయాలను, బిల్లులను ఏకబిగిన బయటకు తీసి విన్యాసం చేయడం కాంగ్రెస్ సారధ్యంలోని యుపిఏ ప్రభుత్వానికి అలవాటే. ఆ అలవాటు నుండి వెలువడిందే ఈ అసంబద్ధ, అసంపూర్తి ప్రకటన....

గురువారం, ఆగస్టు 01, 2013

గాంధీజీకి, కడప హరిజనులకు మధ్య జరిగిన సంభాషణ

కడపలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్న రోజున (1934 జనవరి 1) కొందరు స్థానిక హరిజనులు ఆయనను కలుసుకొని సంభాషించారు.... 

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఆ సంభాషణ కడప జిల్లా హరిజనుల చైతన్యాన్ని, ముక్కుసూటితనాన్ని వ్యక్తీకరించింది. 

గాంధీజీకి, కడప హరిజన మిత్రులకు మధ్య జరిగిన ఆ సంభాషణ .... 



సోమవారం, జులై 29, 2013

శనివారం, జులై 27, 2013

గండికోట రామయ్యకు అన్నమయ్య సమర్పించిన ప్రసాదం

మన గండికోటలో ఒకప్పుడు శ్రీరాములోరు ఉండేవారు. ఆయప్పకు మన తాళ్ళపాక పాటకాడు, తిరుమలప్ప ప్రసాదమూ అయిన అన్నమయ్య పెట్టిన ప్రసాదం ఏమిటి?

మంగళవారం, జులై 23, 2013

కడప జిల్లాలో 1400 తుపాకులు

ప్రాణాపాయం, ఆత్మరక్షణ కోసమని జిల్లాలోని చోటా మోటా నాయకులు, పలువురు వ్యక్తులు అధికారిక లెక్కల ప్రకారం 1400 తుపాకులు కలిగి ఉన్నారు. ఇందులో 77 తుపాకులు  బ్యాం కులకు  భద్రత కల్పిస్తున్న సిబ్బంది....

ఆదివారం, జులై 21, 2013

కేతు విశ్వనాధరెడ్డి గురించి సొదుం జయరాం చెప్పిన సంగతులు

విశ్వాన్ని వెతుక్కుంటూ “ఆంధ్ర రత్న” దినపత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేస్తున్నారు. కలుసుకోగానే ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. ఇద్దరం తిలక్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చి పబ్లిక్ గార్డెన్స్ లో కూచున్నాం. 


కడప స్వచ్చంద సంస్థకు ఎఫ్‌ఎం కమ్యూనిటీ రేడియో స్టేషన్

శుక్రవారం, జులై 19, 2013

డా. ఎన్ రామచంద్ర కథ 'యంగముని వ్యవసాయం'


9వ ఆటా మహాసభల కథల పోటీ లో రూ. 6000 పారితోషికం అందుకున్న కథ

ఏ మహారాజుల వద్దనో అంగరక్షకుడుగా ఉండవలసిన వాడు యంగముని. 
కండలు దిరిగిన దండలు, గుబురు మీసాలు, బండబారిన పాదాలు, అరచేతులు, ఒక్క వెంట్రుకైనా ఊడని, నెరవని జుత్తు, పెద్ద చెవులు, గుండునైనా పిండి చేయగల సత్తా.... 

మునుపటి శ్రావణమాసం ఆంజనేయస్వామి తిరుణాలలో జతపడింది సావిత్రి. యంగమునికి సమవుజ్జీ. ఇరువురి కలియకకు తాళి, మిట్టలు గాక సంకల్ప బలమే సర్వస్వము అయింది.....



సోమవారం, జులై 08, 2013

1921లో కడపలో మహాత్మాగాంధీ .....

ఆ రోజులలో గాంధీ కడపకు ఎట్లా వచ్చారు?
కడపలో మహాత్మాగాంధీ ఏం మాట్లాడారు?


మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యెక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు.

శనివారం, జూన్ 29, 2013

శాసనాలలో రాయల కాలంనాటి చరిత్ర

కృష్ణదేవరాయలు పెనుగొండ నుంచి హంపీ విజయనగరానికి గుర్రంపై స్వారీ చేస్తోంటే గుర్రం వెంట పరిగెడుతూ భూబానాయుడు గొడుగు పట్టాడట. ఇందుకు మెచ్చుకున్న రాయలు గొడుగుపాలునికి ఒక రోజంతా అగ్రహారాలనూ, మాన్యాలనూ దానం చేసే అధికారం ఇచ్చారట!

ఆంద్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన కోకటం గ్రామంలోని సకలేశ్వర స్వామి దీపారాధన కోసం పది ఖండుగల భూమిని దానంగా ఇచ్చినట్లు క్రీ.శ. 1518 నాటి కోకటం గ్రామ శాసనం తెలుపుతోంది. 

కమలాపురం సమీపంలోని తిప్పలూరు గ్రామాన్ని కృష్ణదేవరాయలు అష్టదిగ్గజకవులకు అగ్రహారం గా ఇచ్చినట్లు ....


శనివారం, జూన్ 22, 2013

వై విజయ

నటి వై విజయకు కడప కారెం దోసలంటే ఎందుకంత ఇష్టం?

కడపకూ..వై విజయకు ఉన్న అనుబంధం ఎలాంటిది?

వై విజయ జీవిత విశేషాలను ఆవిష్కరించిన కడప.ఇన్ఫో ఇంటర్వ్యూ...