శుక్రవారం, ఆగస్టు 29, 2014

ఆయనంతే, మొండోడు.. పిచ్చోడు..

చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె, భుజంపై ఎర్ర తువాలు.. పాత తరం మధ్యతరగతి రైతు ఆహార్యంతో దాదాపు జీవితమంతా సంచారంలోనే గడిపిన ఎం.జె.ది అంతుపట్టని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం.

రాయలసీమలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా విప్లవ ప్రజాసంఘాలతో పరిచయమున్న వారందరూ ఆయనను మహామొండి మనిషిగా గుర్తిస్తారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పిలుపులేకపోయినా ఎక్కడినుండో వచ్చి ప్రత్యక్షమవుతాడు. ..

బుధవారం, ఆగస్టు 20, 2014

నా కొడకా మానందీరెడ్డి....

పచ్చశత్రీ సేతబట్టీ…
కిర్రు సెప్పూలేసుకోని
కట్ట మీదా పోతావుంటేరో…

నా కొడకా మానందీరెడ్డీ
నువ్వు కలకటేరనుకొంటిరో…

శుక్రవారం, ఆగస్టు 15, 2014

ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

అరెరే రాజారావు రావుబహద్దర్ నారసింహరెడ్డి
ఏయ్..రెడ్డి కాదు బంగారపు కడ్డీ.. నారసింహరెడ్డి

అరెరే.. ముల్కుల్ కట్టె సేతిలో
ఉంటే మున్నూటికి మొనగాడు
ఆ.. పెట్టి మాటలు ఏదాలోన రండి శూరులారా..

గురువారం, ఆగస్టు 14, 2014

పాలెకత్తె హొన్నూరమ్మ

ఒకరోజు హొన్నూరమ్మ ధరించి ఉన్న చీరను వలుచుకుని వెళ్లగలమని గొల్ల బోయలు హెచ్చరిక చేశారు. దానిని ఒక సవాలుగా తీసుకున్న హొన్నూరమ్మ ఆ రాత్రి కోటలో పహారా కట్టుదిట్టం చేసింది. అన్నమాట ప్రకారం గొల్లబోయలు ఆ రాత్రి మూడవ జామున తమ శక్తియుక్తులతో రాణి మహలులోనికి ప్రవేశించారు. ఒకడు ద్వారం వద్ద ఉన్న సిపాయిని కొట్టి వాని బట్టలు వేసుకుని నిల్చున్నాడు. రెండవవాడు హొన్నూరమ్మ నిద్రించు పట్టెమంచము ముఖమల్ పట్టుపరదాల వెనుక దాక్కుని సిద్ధం చేసుకుని తెచ్చిన చిన్న డబ్బాకు అడుగున సన్నని రంద్రం చేసి డబ్బానిండుగా నీటిని నింపి ఒక పొడుగాటి కర్ర చివరకు డబ్బాను వేలాడదీసి పైకి ఎత్తి పట్టి చాటుగా...

బుధవారం, ఆగస్టు 13, 2014

శ్రీభాగ్ ఒప్పందం

రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16 -11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటిలో తుది తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్‌ ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.

ఆనాటి ఒప్పందంలో రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించి సంతకాలు చేసిన తీర్మానము యధాతధముగా క్రింద ఇవ్వబడినది:

ఆదివారం, ఆగస్టు 10, 2014

పోటెత్తిన విద్యార్థులు...

వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు ...