"గాడ్ ఈజ్ క్రియేటెడ్ బై మాన్” (దేవుడు మానవ సృష్టి) అన్న స్వామి వివేకానందుడు కాషాయ వస్త్రాల్లో ఉన్న ఆధ్యాత్మిక సన్యాసి అయితే, ”కమ్యూనిస్టులకు, కార్మికవర్గ ప్రయోజనాలకు భిన్నంగా వేరే ఏ ఇతర ప్రయోజనాలు ఉండవు. ఉండకూడదు”. అన్న మార్క్సిస్టు తాత్విక చింతనను అణువణువునా వంట పట్టించుకున్న ధవళ వస్త్రాల్లో ఉన్న రాజకీయ సన్యాసి కామ్రేడ్ ఎద్దుల ఈశ్వరరెడ్డి.