పోతన భాగవతంలో దష్టమైన భాగాలను పూరించిన గంగన, సింగన, నారయ్యలు వరంగల్లు ప్రాంతం వారు. వారు 4, 5, 10, 11, 12 స్కంధాలు ఆది నుంచి అంతం దాకా పూరించారు. విరూపాక్షుని సామదాన భేదాలకు లొంగని పోతన ఒంటిమిట్టలో నిలువ లేక పోయాడు. ఒంటిమిట్ట నుండి బండ్లలో తన వస్తువులు సర్దుకొని ఓరుగల్లుకు బయలుదేరినాడు...