రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఐతన్న అనే గొర్రెల కాపరి అడవికి
వేటకు వెళ్ళేవాడు. అతనికి 1986 జనవరి 5వ తేది రాత్రి అడవిలో వేటాడుతుండగా
కొత్తరకం పక్షుల జంట కనబడింది. ఐతన్నకు వెంటనే ఆలోచన తట్టింది.
శాస్త్రవేత్తలు, అధికారులు వెదుకుతున్న పక్షి ఇదేనని భావించాడు.
పోస్టర్లలోని పోటోతో ఈ పక్షులను పొల్చుకుని నిర్థారించుకున్నాడు. ఆ పక్షుల
జంటలో ఓ పక్షిని అతి కష్టంమీద పట్టుకుని ఇంటికి తీసుకువెళ్ళాడు.