సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన నేలలు, నదులు, అడవులు, అధిక
వర్షపాతం వంటి సహజ వనరులతో పాటు విద్య, వైద్యం వంటి మానవవనరులు, నీటి
పారుదల వంటి మౌలికసదుపాయాలు పుష్కలంగా కలిగి విరాజిల్లుతున్న కోస్తాంధ్ర
ఎక్కడ? రాళ్ళు, రప్పలు, మెట్ట భూములు, అల్ప వర్షపాతం, కరువుకాటకాలతో పాటు
అవిద్య, అరకొర మౌలిక సదుపాయాలు కలిగి వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న
రాయలసీమ ఎక్కడ?