బుధవారం, ఏప్రిల్ 30, 2014

బాబూ! నీ హయాంలో కడప జిల్లా ఆం.ప్ర మ్యాపులో ఉన్నట్లు మీకు కనబడితే కదా!!

పందొమ్మిదేళ్ళ బాబు గారి హయాంలో వారి సారధ్యంలోని తెదేపా ద్వారా కడప జిల్లాకు ఒనగూరిన గుర్తుంచుకోదగిన ప్రయోజనాలు ఇవీ. వీటిల్లో సిమెంటు రోడ్లు వెయ్యటం, ఇంకుడు గుంటలు తవ్వటం, నిధులివ్వకుండా ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చెయ్యటం, కాలువలు ఆధునీకరించడం లాంటి పెద్ద పెద్ద పనులు గుర్తుకొస్తాయి. కడప జిల్లాపై బాబుగారి చూపు ఎటువంటిదో తెలిపే కొన్ని ఉదాహరణలు ...

గురువారం, ఏప్రిల్ 17, 2014

విజయానంద్ ఐఏఎస్

పేరు : విజయానంద్ కే
విద్యార్హత : మెకానికల్ ఇంజనీరిగ్ లో ఎంటెక్ (జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం - అనంతపురం నుండి)
ఊరు : రాజుపాలెం (కడప జిల్లా)

శనివారం, ఏప్రిల్ 12, 2014

బుగ్గొంక - “నెహర్-ఎ-దావూదీ"

కడప నగరం మున్సిపాలిటీగా మారిన తర్వాత, ఎర్రముక్కపల్లె, నాగరాజుపేట, సున్నపురాళ్ళపల్లె, గుంతబజార్ ప్రాంతాలకు బుగ్గ నుంచి మంచి నీటిని గొట్టాల ద్వారా అందించే వారు. ఈ నీటి కోసమే తక్కిన ప్రాంతాల వారు కూడా పరుగులు తీసేవారు. ఈ నీరు రుచిగా ఉండటంతో పాటు, వారాల కొద్ది నిలువ ఉంచినా నీరు కలుషితం కాకపోవడం వలన అపురూపమైనదిగా భావించే వారు.

గురువారం, ఏప్రిల్ 10, 2014

K.S.జవహర్‌రెడ్డి ఐఏఎస్

K.S.జవహర్‌రెడ్డి కడప జిల్లాకు చెందిన ఒక ఐఏఎస్ అధికారి. వీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పలు హోదాలలో విధులు నిర్వర్తించారు. K.S.జవహర్‌రెడ్డి ప్రొఫైల్, ఫోటోలు, ఇతరత్రా వివరాలు ...

మంగళవారం, ఏప్రిల్ 08, 2014

డిఎల్ సైకిలెక్కినట్లేనా!

దువ్వూరులో సోమవారం డిఎల్ రవీంద్రారెడ్డి తన అనుచరులతోపాటు మైదుకూరు తెదేపా ఇన్‌ఛార్జి పుట్టాసుధాకర్‌యాదవ్, ఆ పార్టీ కార్యకర్తలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో డీఎల్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో మారిన పరిస్థితులు అందరికి తెలిసిందేనని, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో అందరం కలిసి కట్టుగా తెదేపా గెలుపునకు పాటుపడాలని పేర్కొన్నారు. 

సోమవారం, ఏప్రిల్ 07, 2014

ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తా!

కడప లోక్‌సభ ఎన్నికల్లో గతంలో పలు అవకాశాలు తృటిలో జారిపోయాయని - తనకు ఎంపీ టికెట్ ఇస్తే నిధుల వరద పారిస్తానని చెప్పారు. 
మొత్తానికి లోక్ సభ అభ్యర్తిత్వం ఖరారైతే ఎన్నికలలో మరోమారు నిధుల వరద పారించేందుకు  కందుల సోదరులు సిద్ధమయ్యారన్నమాట! ఇప్పటికే డిఎల్ కడప తెదేపా లోక్ సభ అభ్యర్తిత్వం ఆశిస్తుండగా ఆశావాహుల జాబితాలో కందుల బ్రదర్స్ చేరారు. మరి బాబు ఈ అంశాన్ని ...

కడప జిల్లాపై చంద్రబాబుగారి వంకర చూపు

నష్టాల బాట పట్టాయని చెప్పి కడప సహకార చెక్కెర కర్మాగారాన్ని, ప్రభుత్వ ఆధీనంలోని ప్రొద్దుటూరు పాల కర్మాగారాన్ని మూయించేసి వాటిపై ఆధారపడ్డ ఉద్యోగులకు ప్రత్యామ్నాయం చూపకుండా వదిలేశారు. అదేమని అడిగితే సంస్కరణలు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన నందలూరు ఆల్విన్ కర్మాగారాన్ని బాబుగారు 1999లో ప్రయివేటు పరం చేశారు. 

ఆదివారం, ఏప్రిల్ 06, 2014

సదువుకుంటే వైకాపాకు ఓటేయొద్దా!

ఎన్నికల పోరు సమీపిస్తున్న సందర్భంలో రాజకీయాలపై, పరిణామాలపై ఆసక్తి కాస్త అధికంగానే ఉంటుంది. టీ టైములో లేదా భోజన సమయంలో కలిసినప్పుడు సహోద్యోగుల మధ్య రాజకీయ చర్చలు నడవటం సర్వసాధారణం. ఈ చర్చలలో ఒక్కొక్కరివి ఒక్కో అంచనాలు. ఒక్కొక్కరివి ఒక్కో రకమైన అభిప్రాయాలు. ఈ మధ్య కాలంలో ఒక వింతైన, గమ్మత్తైన వాదన ఒకటి మేధావులుగా  చలామణీ అవుతున్న ఒక వర్గం నోట   తరచూ  వినిపిస్తోంది  - అదేమంటే  'సదువుకున్న వాళ్ళెవరైనా వైకాపాకు ఓటేస్తారా?' ...

శనివారం, ఏప్రిల్ 05, 2014

కడప జిల్లాలో చెంచుల వీధి భాగవతం

ఉగాది సందర్భంగా (అదే రోజు) సోమవారం రాత్రి జరిగిన శ్రీ జనార్ధనస్వామి తిరుణాళలో ప్రదర్శించిన చెంచు (చెంచులక్ష్మి వీధిబాగవతం) నాటకం ప్రేక్షకులను అలరింపచేసింది. అలయ ధర్మకర్త పగిడి రంగయ్య దాసు ఆధ్వర్యంలో ఈ తిరుణాల , వీధి నాటక ప్రదర్శన జరిగింది.
రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున 4 గంటల దాకా జరిగిన ఈ చెంచు నాటకాన్ని వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా ఆసక్తిగా తిలకించడం ...