గురువారం, అక్టోబర్ 31, 2013

అద్వితీయ ప్రతిభాశాలి

పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో తక్కిన రచయితలకూ ఆయనకూ అటువంటి భేదం ఉంటుంది. మర్రిచెట్టుకూ, తక్కిన వృక్షాలకూ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ప్రౌఢిలో, విస్తీర్ణతలో, ఆయనకూ ఇతర కవులకూ అటువంటి వ్యత్యాసం వుంటుంది. 

సోమవారం, అక్టోబర్ 28, 2013

హైదరాబాద్ నగరం ఎవరికి కావాలి?

సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన నేలలు, నదులు, అడవులు, అధిక వర్షపాతం వంటి సహజ వనరులతో పాటు విద్య, వైద్యం వంటి మానవవనరులు, నీటి పారుదల వంటి మౌలికసదుపాయాలు పుష్కలంగా కలిగి విరాజిల్లుతున్న కోస్తాంధ్ర ఎక్కడ? రాళ్ళు, రప్పలు, మెట్ట భూములు, అల్ప వర్షపాతం, కరువుకాటకాలతో పాటు అవిద్య, అరకొర మౌలిక సదుపాయాలు కలిగి వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న రాయలసీమ ఎక్కడ?

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

'ప్రపంచానికి రాయలసీమ చాలా కానుకలను ప్రసాదించింది' - రావూరి భరద్వాజ

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది.

మంగళవారం, అక్టోబర్ 22, 2013

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. 

శనివారం, అక్టోబర్ 19, 2013

వదినకు ఒకసరి - జానపద గీతం

వదినకు ఒకసరి
బిందెకు బిగసరి
బంగారు జడ కుచ్చుల మా వదిన
 
తాటి తోపులో
పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన
తన నడుముకు కట్టమంటది మా వదిన

గురువారం, అక్టోబర్ 17, 2013

కడప నుండి కలెక్టరేట్‌ వరకూ ….

కలెక్టరేట్‌ ఎలా వుంటుంది?
కలెక్టర్‌ కనుసన్నలలో  నడుస్తూ, ప్రభుత్వ శాసనాల అమలును పర్యవేక్షిస్తూ నిరంతరం జన సందోహంతో రద్దీగా ఉంటుంది.
చాలా సంవత్సరాల క్రితం…
ఇలా రద్దీగా ఉండే కలెక్టరేట్‌లోకి అడుగుపెట్టిన రాయలసీమ పిల్లోడు దానిని పర్యవేక్షించే అధికారులను దగ్గరగా గమనించాడు. తను కూడా వారిలా ప్రజా సమస్యలను తీర్చే అధికారి కావాలని కలలు కన్నాడు.

శనివారం, అక్టోబర్ 12, 2013

వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద ఆధారపడి ఉండాలా?

1956లో ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు ముందు, పైపథకాలన్నీ అమలు కాలేదు కాబట్టి, నేడు ఆ పథకాలకు నీటి కేటాయింపులన్నీ మిగులు జలాలతో ముడిపడి ఉన్నందున, వాటి కోసం కోస్తా, తెలంగాణ ప్రజల దయాదాక్షిణ్యాల మీద సీమ ఆధారపడి ఉండాలని విద్యాసాగర్‌రావు అభిప్రాయంగా కనిపిస్తోంది.

శుక్రవారం, అక్టోబర్ 11, 2013

తిరిగొచ్చిన ఆది

జమ్మలమడుగు కాంగ్రెస్ శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి వైకాపా గూటికి తిరిగొచ్చారు. గతంలో కడప ఉప ఎన్నికల సమయంలో ఆయన జగన్ కే మద్దతు ఇచ్చారు. కాకపోతే ఆ తర్వాత కాంగ్రెస్ అదికారంలో ఉండడంతో తనకు వ్యక్తిగతం గా వచ్చే ఇబ్బందులను...

సోమవారం, అక్టోబర్ 07, 2013

ఆంధ్రప్రదేశ్ లోనే ఎత్తైన జలపాతం

నూరు ఏనుగు తొండాలతో కుమ్మరించినట్టు జలధార పైనుంచి భూమిలోకి దిగగోట్టినట్లు పడుతుంటుంది. అక్కడున్న ఒళ్ళు గగుర్పొడిచే గుండం, అర్ధముఖాకృతి నుంచి చిప్పిల్లే నీటి తుంపరలు పారవశ్యం కలిగిస్తున్నట్లుంది. ఓ పావురాల గుంపు పదేపదే అక్కడ చక్కర్లు కొడుతోంది. పాకుడు పట్టిన రాళ్ళ మధ్య పొడుచుకు వచ్చిన ఫెర్న్ మొక్కలు పాము పడగలల్లే... 

శనివారం, అక్టోబర్ 05, 2013

మా ‘గండికోట’కు పురస్కారం

ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 27 రాత్రి హైదరాబాదులో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి వట్టి వసంత కుమార్, చేనేత, జౌళి శాఖా మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా  కడప.ఇన్ఫో గౌరవ సంపాదకులు తవ్వా ఓబుల్ రెడ్డి పురస్కారాన్ని....

శుక్రవారం, అక్టోబర్ 04, 2013

సీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదా!

రాయలసీమ కృష్ణా పరివాహక ప్రాంతంలో లేదని చెప్పడం మూర్ఖత్వం. కృష్ణా జలాల్లో రాయలసీమకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలన్న శ్రీబాగ్ ఒప్పందం కాలగర్భంలో కలిసిపోయింది. కృష్ణా- పెన్నా ప్రాజెక్టులు అటకెక్కించారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా నిర్మిస్తామని చెప్పిన సిద్దేశ్వరం గాలిలో కలిసిపోయింది. బళ్లారిని రాయలసీమ వాసులు కోల్పోయారు. ..

గురువారం, అక్టోబర్ 03, 2013

జగన్ కోసం తెదేపా ఎన్నికల ప్రచారం చేసి పెడుతోందా?

హెడ్డింగ్ చూసి ఆశ్చర్య పోతున్నారా? ఇది నిజం. మీరు అవునన్నా కాదన్నా రాబోయే సార్వత్రిక ఎన్నికల కోసం జగన్ కు ప్రచారం చేసి పెట్టి తద్వారా వైకాపాకు మరిన్ని ఓట్లు పడేలా కృషి చేయాలని కాకలు తీరిన చంద్రబాబు గారి నేతృత్వంలోని తెదేపా కీలక నిర్ణయం తీసుకుంది. మాకు తెలుసు తెదేపా అభిమానులు, కార్యకర్తలు ఈ విషయం విని విస్మయానికి గురవుతారని....

బుధవారం, అక్టోబర్ 02, 2013

జానపదబ్రహ్మ మునెయ్య - పాటలు

పచ్చశత్రీ  సేతబట్టి...
కిర్రు సెప్పులేసుకోని ...
కట్టమీద  పోతా వుంటేరో ...