ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు
ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు
వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు
తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్
వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత
ఘాటెక్కనుంది.