ఆదివారం, నవంబర్ 17, 2013

బత్తుల ప్రసాద్ కథ 'కుప్పకట్లు'

అవదాన్లయ్య ఈనికి నేనేమి వైద్యం శెప్పినానబ్బ అని కాసేపు ఆలోశన జేసి, ‘ఇంతకు ఏమి వైద్యం శెప్పినానురా’ అనడిగినాడు. ‘అదేంది సోమీ, వారం కిందట నీకాడికి వచ్చి కండ్లు మసకలు మసకలుగా కనపడ్తాండాయి సోమి అనంటే… పొయి జిల్లేడుపాలు పోసుకో పోరా అని జెప్తివి మరిసిపోతివా’ అని నారయ్య జెప్తా వుంటే అవదాన్లయ్య నోరెళ్లబెట్టి సూచ్చాండడు.
‘ఏందిరా నిజ్జంగా జిల్లేడుపాలు కండ్లల్లో పొడ్సుకున్నెవా’....

శుక్రవారం, నవంబర్ 15, 2013

బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట!

సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట.


బుధవారం, నవంబర్ 06, 2013

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

 హైదరాబాదు ఆదర్శనగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడు స్టేట్ మంత్రిహోదా వుండేది. ఆయనను కేబినేట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ...

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవుని కడప రధోత్సవ వైభవం

 కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప వేంకటేశ్వరుని రధోత్సవ వైభవాన్ని ఇలా కీర్తించాడు….
కన్నులపండుగలాయ గడపరాయనితేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు