గురువారం, మార్చి 13, 2014

అది సీమ సంస్కృతా?

నిన్నటి వరకు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణా సంస్కృతి పేరుతొ ఉద్యమం చేపట్టిన గులాబీ దళపతి ఇప్పుడు  ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల్ లో సీమ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం ...

సోమవారం, మార్చి 10, 2014

కడప జిల్లా మండలాధ్యక్ష స్థానాల రిజర్వషన్ల వివరాలు

కడప జిల్లాలోని 50 మండలాధ్యక్ష స్థానాలలో (ఎంపిపి) 27 పురుషులకు, 23 మహిళలకు కేటాయించారు. దీనికి సంబంధించి శనివారం రాత్రి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోన శశిధర్ రిజర్వేషన్ల జాబితాపై సంతకం చేశారు.  మండలాల వారీగా రిజర్వషన్ల వివరాలు..

బుధవారం, మార్చి 05, 2014

తవ్వా ఓబుల్ రెడ్డి కథ 'కడుపాత్రం'

”కేబుల్‌టీవీలు, గ్రాఫిక్‌సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా బొమ్మలాటలు ఎవరు జూడొచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, ...

శుక్రవారం, ఫిబ్రవరి 28, 2014

2011 జనాల లెక్కలు ...

జిల్లాలోని జనాల(భా) వివరాలు క్రింది విధంగా ఉన్నాయి ...

సోమవారం, ఫిబ్రవరి 24, 2014

సంబెట శివరాజు నిర్మించిన తిరుమలనాథ ఆలయం!

వై.ఎస్‌.ఆర్‌. కడప జిల్లా మైదుకూరు మండలంలోని యల్లంపల్లె సమీపంలో వెలసిన శ్రీ తిరుమలనాథ స్వామి ఆలయం చారిత్రక విశిష్టతతో ఆధ్యాత్మిక శోభతో అలరారుతూ భక్తులను విశేషంగా ఆకర్శిస్తూ ఉన్నది. కొండలు, గుట్టలు, చెరువులతో కూడిన పకృతి రమణీయత నడుమ ఎత్తైన ఒక గుట్టపై వెలసిన ఈ ఆలయం...

గురువారం, ఫిబ్రవరి 20, 2014

రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) కథ 'ఓడిపోయిన సంస్కారం'

ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను – భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు. అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో?

గురువారం, ఫిబ్రవరి 13, 2014

ప్రపంచంలోకెల్లా ప్రత్యేక నిక్షేపాలు కడప జిల్లాలో ....

మంగంపేటలో  నిక్షేపాలున్నట్లు మొదటగా 1872లో డబ్ల్యు.కింగ్ అనే బ్రిటీషు అధికారి చేసిన సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రపంచంలోనే 28శాతం ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. భారతదేశంలో లభ్యమయ్యే ముగ్గురాయిలో 98 శాతం మంగంపేట గనుల నుండే ...

ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

గండికోట శ్రీరామచంద్రునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన

కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి 
ప||  రాజవు నీకెదురేదీ రామచంద్ర     
రాజీవ నయనుడ రామచంద్ర 

చ|| వెట్టిగాదు నీవలపు 
వింటి నారికి దెచ్చితిని 
(ర)ఱట్టు సేయ బనిలేదు 
ఇట్టే రామచంద్ర ..

శనివారం, ఫిబ్రవరి 08, 2014

గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన

చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం: సామంత       కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ ...

శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014

ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే!

ఖమ్మంజిల్లా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్ పునర్య్వస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. పనులు మొదలై మధ్యలో నిలిచిపోయిన బ్రహ్మణిని పూర్తిచేసే అంశాన్ని ఎందుకు చేర్చలేదు? 
 పోలవరం కడతామంటున్నారు. సీమలో మంచినీళ్లుకూడా లేవు. ఇక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికైనా నిధులు ఇస్తామని ఎందుకు చెప్పడంలేదు?

మంగళవారం, ఫిబ్రవరి 04, 2014

ఫేస్‌బుక్ లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు …

ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్ వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత ఘాటెక్కనుంది.

ఆదివారం, ఫిబ్రవరి 02, 2014

ఈపొద్దు ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ

ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఎన్నికల పోలింగ్, 11.30 నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు జరుగుతూ ఉండగానే అధ్యక్ష పదవికి పోలింగ్ అవసరమైతే మరో వైపు నిర్వహిస్తారని...

శుక్రవారం, జనవరి 31, 2014

మూడు రోజులకు ముందు సరసోక్తులాడుకొన్న గొంతు మూగబోతే …

“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమంది....

గురువారం, జనవరి 23, 2014

‘ఫూలోంకి సేజ్’ కాస్తా ‘కాంటోంకీ సేజ్’ అయ్యింది.

అంజలి పిక్చర్స్ బ్యానర్‌లో 1962లో అనుకుంటా! అశోక్ కుమార్, మనోజ్‌కుమార్, వైజయంతిమాల వంటి మేటి తారలతో ‘ఫూలోంకి సేజ్’ (పూలపాన్పు) అనే సినిమా తీశాం. విడుదలయ్యే సరికి అది కాస్తా ‘కాంటోంకీ సేజ్’ (ముళ్ళ పాన్పు) లా తయారయ్యింది. ఆ సినిమా కారణంగా చాలా నష్టపోయాం. ఇండ్రస్టీలో ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు....

పూర్తి వివరాలు ...

ఆదివారం, జనవరి 19, 2014

కేతు విశ్వనాధ రెడ్డి కథ 'కూలిన బురుజు'

ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.
ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో?