ఒకరోజు హొన్నూరమ్మ ధరించి ఉన్న చీరను వలుచుకుని వెళ్లగలమని గొల్ల బోయలు
హెచ్చరిక చేశారు. దానిని ఒక సవాలుగా తీసుకున్న హొన్నూరమ్మ ఆ రాత్రి కోటలో
పహారా కట్టుదిట్టం చేసింది. అన్నమాట ప్రకారం గొల్లబోయలు ఆ రాత్రి మూడవ
జామున తమ శక్తియుక్తులతో రాణి మహలులోనికి ప్రవేశించారు. ఒకడు ద్వారం వద్ద
ఉన్న సిపాయిని కొట్టి వాని బట్టలు వేసుకుని నిల్చున్నాడు. రెండవవాడు
హొన్నూరమ్మ నిద్రించు పట్టెమంచము ముఖమల్ పట్టుపరదాల వెనుక దాక్కుని సిద్ధం
చేసుకుని తెచ్చిన చిన్న డబ్బాకు అడుగున సన్నని రంద్రం చేసి డబ్బానిండుగా
నీటిని నింపి ఒక పొడుగాటి కర్ర చివరకు డబ్బాను వేలాడదీసి పైకి ఎత్తి పట్టి
చాటుగా...