రాయలసీమ వాసుల అనుమానాల్ని తీర్చడానికి, అగాధాల్ని తగ్గించడానికి ఆంధ్ర
మాహాసభ ఉపసంఘము ఏర్పాటు చేసినారు. ఈ ఉపసంఘము పలు దఫాలుగా చర్చలు జరిపి 16
-11 -1937 లో నాటి మద్రాసు నగరంలోని కాశీనాధుని నాగేశ్వర రావు ఇంటిలో తుది
తీర్మానము చేయుటకు సమావేశమైంది. ఆ సమావేశములో పాల్గొన్న రాయలసీమ, కోస్తా
నాయకులు ఒక ఒడంబడికను కుదుర్చుకొని సంతకం చేసినారు. ఆ ఒప్పందమే శ్రీభాగ్
ఒడంబడికగా ప్రసిద్ది చెందింది.
ఆనాటి ఒప్పందంలో రెండు ప్రాంతాల నాయకులు అంగీకరించి సంతకాలు చేసిన తీర్మానము యధాతధముగా క్రింద ఇవ్వబడినది: