“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమంది....