”కేబుల్టీవీలు, గ్రాఫిక్సినిమాలతో హోరెత్తిపోతున్న ఈ కాలంలో ఇంకా
బొమ్మలాటలు ఎవరు జూడొచ్చారు? మీకు ఎర్రిగాని… ఊళ్ళోకి వచ్చినందుకు అంతో
ఇంతో లెక్క అడుక్కోని దోవ బట్టుకోని పోర్రి… ఎందుకింత సెమ!” నిన్నరాత్రి
పొరుగూర్లో గ్రామపెద్దలు అన్నమాటలు, రోడ్డు గతుకుల్లా బండిలోని వెంకటరావును
కుదిపివేస్తున్నాయి. ఆ రాత్రికి ఆ వూర్లోనే గడిపి, ఆటాడకుండా
తెల్లవారుజామున్నే బృందాన్ని తట్టిలేపి, ...