శుక్రవారం, జనవరి 31, 2014

మూడు రోజులకు ముందు సరసోక్తులాడుకొన్న గొంతు మూగబోతే …

“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమంది....

గురువారం, జనవరి 23, 2014

‘ఫూలోంకి సేజ్’ కాస్తా ‘కాంటోంకీ సేజ్’ అయ్యింది.

అంజలి పిక్చర్స్ బ్యానర్‌లో 1962లో అనుకుంటా! అశోక్ కుమార్, మనోజ్‌కుమార్, వైజయంతిమాల వంటి మేటి తారలతో ‘ఫూలోంకి సేజ్’ (పూలపాన్పు) అనే సినిమా తీశాం. విడుదలయ్యే సరికి అది కాస్తా ‘కాంటోంకీ సేజ్’ (ముళ్ళ పాన్పు) లా తయారయ్యింది. ఆ సినిమా కారణంగా చాలా నష్టపోయాం. ఇండ్రస్టీలో ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు....

పూర్తి వివరాలు ...

ఆదివారం, జనవరి 19, 2014

కేతు విశ్వనాధ రెడ్డి కథ 'కూలిన బురుజు'

ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.
ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో?

శుక్రవారం, డిసెంబర్ 27, 2013

వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ ...

,”బాబుగారు! మీరు ఏమి చదువుకున్నారు?”అని అడిగినప్పుడు చాలా సిగ్గుపడ్డాను.యెందుకంటే,ఆ అ’గణిత’ మేధావి ముందు మనం నిరక్షురలం క్రింద లెక్క వేసుకొనవచ్చు.”మీరు ఏ రోజు పుట్టారు బాబు గారు?”అని అడిగారు. దానికి నేను సమాధానంగా,”శ్రీ వికృతి నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు,రోహిణీ నక్షత్రంలో జన్మించాను.”అని చెప్పాను.వెంటనే రెండు నిముషాలలోపే,”అంటే, 22 -12 -1950 న,మంగళవారం జన్మించారు” అని చెప్పి ... 


బుధవారం, డిసెంబర్ 18, 2013

ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ...

సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ...

శనివారం, డిసెంబర్ 14, 2013

జంతువులను ఆడించినట్లు ...

 కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి ఎలాంటి వ్యవస్థ ఉండాలి? అప్పులు-ఆదాయాల పంపకం ఎలా చేయాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేసుకోవాలి? యువత విద్యా, ఉపాధి అవకాశాలెలా పెంచాలి?

ఆదివారం, నవంబర్ 17, 2013

బత్తుల ప్రసాద్ కథ 'కుప్పకట్లు'

అవదాన్లయ్య ఈనికి నేనేమి వైద్యం శెప్పినానబ్బ అని కాసేపు ఆలోశన జేసి, ‘ఇంతకు ఏమి వైద్యం శెప్పినానురా’ అనడిగినాడు. ‘అదేంది సోమీ, వారం కిందట నీకాడికి వచ్చి కండ్లు మసకలు మసకలుగా కనపడ్తాండాయి సోమి అనంటే… పొయి జిల్లేడుపాలు పోసుకో పోరా అని జెప్తివి మరిసిపోతివా’ అని నారయ్య జెప్తా వుంటే అవదాన్లయ్య నోరెళ్లబెట్టి సూచ్చాండడు.
‘ఏందిరా నిజ్జంగా జిల్లేడుపాలు కండ్లల్లో పొడ్సుకున్నెవా’....

శుక్రవారం, నవంబర్ 15, 2013

బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట!

సెట్టి బలిజలు, గాజుల బలిజలు, రాజ మహేంద్రవరం బలిజలని మూడు తెగలున్నవి. అందులో సభాపతి మొదటి తెగకు చెందినవారు. ఆయన చిన్నతనంలో వాళ్ళయింట బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట. మణుగు బంగారం వాళ్ళ తండ్రిగారి వాటాగా ఉండేదట.


బుధవారం, నవంబర్ 06, 2013

చంద్రబాబు కోసం వైఎస్ రెకమండేషన్

 హైదరాబాదు ఆదర్శనగర్ లో నేను వుంటున్న ఒక అద్దె ఇంటికి భవనం వెంకట్రామ్ తరచు వచ్చేవాడు. అప్పుడు ఆయన కోసం వచ్చిన ప్రముఖులలో వై.యస్.రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, పాలడుగు వెంకట్రావు మొదలైనవారుండేవారు. భవనం ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబునాయుడు స్టేట్ మంత్రిహోదా వుండేది. ఆయనను కేబినేట్ హోదాకు పెంచాలని వై.ఎస్.రాజశేఖర రెడ్డి ...

శుక్రవారం, నవంబర్ 01, 2013

దేవుని కడప రధోత్సవ వైభవం

 కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప వేంకటేశ్వరుని రధోత్సవ వైభవాన్ని ఇలా కీర్తించాడు….
కన్నులపండుగలాయ గడపరాయనితేరు
మిన్ను నేల శృంగారము మితిమీరినట్లు

గురువారం, అక్టోబర్ 31, 2013

అద్వితీయ ప్రతిభాశాలి

పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో తక్కిన రచయితలకూ ఆయనకూ అటువంటి భేదం ఉంటుంది. మర్రిచెట్టుకూ, తక్కిన వృక్షాలకూ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ప్రౌఢిలో, విస్తీర్ణతలో, ఆయనకూ ఇతర కవులకూ అటువంటి వ్యత్యాసం వుంటుంది. 

సోమవారం, అక్టోబర్ 28, 2013

హైదరాబాద్ నగరం ఎవరికి కావాలి?

సుదీర్ఘమైన సముద్ర తీర ప్రాంతం, సారవంతమైన నేలలు, నదులు, అడవులు, అధిక వర్షపాతం వంటి సహజ వనరులతో పాటు విద్య, వైద్యం వంటి మానవవనరులు, నీటి పారుదల వంటి మౌలికసదుపాయాలు పుష్కలంగా కలిగి విరాజిల్లుతున్న కోస్తాంధ్ర ఎక్కడ? రాళ్ళు, రప్పలు, మెట్ట భూములు, అల్ప వర్షపాతం, కరువుకాటకాలతో పాటు అవిద్య, అరకొర మౌలిక సదుపాయాలు కలిగి వెనుకబాటుతనంతో కునారిల్లుతున్న రాయలసీమ ఎక్కడ?

శుక్రవారం, అక్టోబర్ 25, 2013

'ప్రపంచానికి రాయలసీమ చాలా కానుకలను ప్రసాదించింది' - రావూరి భరద్వాజ

అమానుషమయిన పరిస్థితులలో జన్మించి, ముసురుకొంటున్న అవరోధాలన్నింటినీ దోహదాలుగా మలుచుకొంటూ జీవించడమే అద్భుతమనుకొంటున్న దశలో ఆ జీవితాన్ని ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దడం వెనుకగల కృషి, ఆ రంగంలో ఉన్నవారికి లోతుగా తెలుస్తుంది. ఇతరులకు ఉపరితల దర్శనం మాత్రమే అవుతుంది. అలాంటి ఆదర్శజీవులు, మనదేశంలోనూ ఉన్నారు. మన రాష్ట్రంలోనూ ఉన్నారు – మన రాష్ట్రంలోనూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూ, అఖిల భారతావనికీ – ఒక మేరకు – ప్రపంచానికి కూడా రాయలసీమ, చాలా కానుకలను ప్రసాదించింది.

మంగళవారం, అక్టోబర్ 22, 2013

పోతన మనుమలు స్తుతించిన ‘వరకవి సార్వభౌముడు’

బమ్మెరపోతన మనుమలు కేసన, మల్లనలు. వీరు పోతనకు ముమ్మనుమలనియు తెలుస్తున్నది. వీరు జంటకవులు. విష్ణు భజనానందం, దాక్షాయణీ పరిణయం అను రెండు కావ్యాలు రచించారు. దాక్షాయణీ పరిణయంలోని ‘సుకవి స్తుతి’లో తమ తాత పోతరాజును, ఇతర కవులను ప్రశంసించారు. 

శనివారం, అక్టోబర్ 19, 2013

వదినకు ఒకసరి - జానపద గీతం

వదినకు ఒకసరి
బిందెకు బిగసరి
బంగారు జడ కుచ్చుల మా వదిన
 
తాటి తోపులో
పామును చూసి (2) వడ్డాణమంటది మా వదిన
తన నడుముకు కట్టమంటది మా వదిన