చేతిలో సంచి, మాసిన గడ్డం, అడ్డపంచె,
భుజంపై ఎర్ర తువాలు.. పాత తరం మధ్యతరగతి రైతు ఆహార్యంతో దాదాపు జీవితమంతా
సంచారంలోనే గడిపిన ఎం.జె.ది అంతుపట్టని ఒక విలక్షణమైన వ్యక్తిత్వం.
రాయలసీమలోనే కాదు, రాష్ట్రవ్యాప్తంగా
విప్లవ ప్రజాసంఘాలతో పరిచయమున్న వారందరూ ఆయనను మహామొండి మనిషిగా
గుర్తిస్తారు. ఎక్కడ ఏ సమావేశం జరిగినా, ఏ పిలుపులేకపోయినా ఎక్కడినుండో
వచ్చి ప్రత్యక్షమవుతాడు. ..