The Largest Viewed Website of Kadapa (YSR) District. Kadapa News, Information, Politics, Photos, Videos, Villages, Train Timings, Tourism Spots, Fairs and Festivals and What not?
బుధవారం, అక్టోబర్ 15, 2008
కంటెంట్ కాపీ హక్కు
www.kadapa.info లోని సమాచారాన్ని,ఫోటోలను కొంత మంది అనుమతి లేకుండా స్వీకరించి వేరే వెబ్ సైట్లో(డమ్మీ) ఉపయోగిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. సమాచారాన్ని అనుమతి లేకుండా ఇలా వాడిన పక్షంలో న్యాయ పరమైన చర్యలు తీసుకోబడును.
బుధవారం, ఆగస్టు 06, 2008
మీకు నచ్చిందా...
kadapa.info వెబ్ ప్రపంచంలోకి అడుగిడి వడివడిగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం సగటున నెలకు ఒక లక్షా యాభై వేల హిట్స్ ను kadapa.info చేరుకుందని తెలియచేయటానికి సంతోషిస్తున్నాం. రాబోయే రోజులలో మరింత మెరుగైన సమాచారాన్ని మీ ముందుకు చేర్చే బృహత్తర కార్యక్రమానికి kadapa.info శ్రీకారం చుట్టింది. kadapa.infoలో ఎటువంటి సమాచారం ఉండాలని (లేదా) ఎటువంటి సమాచారం ఉంటే బాగుంటుందని మీరు భావిస్తున్నారో మాకు తెలియచేయండి. మీ అభిప్రాయాలను ఇక్కడ వ్యాఖ్యలలో పొందుపరచండి లేదా సంప్రదింపుల పుట ద్వారా రాయండి. మీ అభిప్రాయాలకు అనుగుణంగా www.kadapa.infoను తీర్చిదిద్దుతామని సవినయంగా మనవి చేస్తున్నాం
గురువారం, డిసెంబర్ 20, 2007
పుష్పగిరి చిత్రాలు
దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం...
పుష్పగిరి శిల్పకళా సౌందర్యం తెలియచేసే చిత్రాలు ఇప్పుడు www.kadapa.infoలో లభ్యం..
http://kadapa.info/pushp_gallery.html
పుష్పగిరి శిల్పకళా సౌందర్యం తెలియచేసే చిత్రాలు ఇప్పుడు www.kadapa.infoలో లభ్యం..
http://kadapa.info/pushp_gallery.html
పోతన జన్మస్థలం
కడపజిల్లా సాంస్కతికోత్సవాలు (డిసెంబరు 20- 23) నిర్వహిస్తున్న సందర్భంగా పోతన జన్మస్థలం, ప్రాంతానికి సంబంధించి చర్చకు తెరలేపుతూ కడప జిల్లా,ఒంటిమిట్ట వాడని కొత్త వాదాన్ని తోడుతున్నారు. ఇరవైశతాబ్దం తొలి దశాబ్దంలోనే కందుకూరి వీరేశ లింగం పంతులు మహాకవి పోతన వరంగల్‌జిల్లా, బమ్మెర గ్రామానికి చెందినవాడని నిర్థారించి కవుల చరి త్ర రచించారు...........
- ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆధ్యాపకులు
ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి?
మరిన్ని అభిప్రాయాలను ఇక్కడ చదవండి.
www.kadapa.info/pothana.html
- ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆధ్యాపకులు
ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి?
మరిన్ని అభిప్రాయాలను ఇక్కడ చదవండి.
www.kadapa.info/pothana.html
సోమవారం, జూన్ 18, 2007
వార్తా లేఖకులకు స్వాగతం!
ప్రపంచం నలుమూలల ఉన్న కడప జిల్లా వాసులకు ఇదే మా ఆహ్వానం.
మీరు వార్తలు రాయాలనుకుంటున్నారా?
లేక రచనలు చెయ్యాలనుకుంటున్నారా?
కడప.ఇన్ఫో మీ కోసమే ఎదురు చూస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం!
కడప జిల్లాకు సంబంధించిన ఏ అంశాలపైనైనా మీరు కలాన్ని పట్టవచ్చు.
సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వారైతే, మీరు చేసిన రచనలు మాకు పంపవచ్చు.
మీ రచనలకు తుది మెరుగులు దిద్డి ప్రచురించే పూర్తి భాద్యతను కడప.ఇన్ఫో స్వీకరిస్తుంది.
మీరు ప్రవాసీయులైతే ఆయా ప్రదేశాలలో జరిగే తెలుగు కార్యక్రమాలను రిపోర్ట్ చెయ్యవచ్చు.
మీరు రచనలను పంపే పక్షంలో editor@kadapa.info కు పంపండి. వార్తలు, సమాచారం పంపదలుచుకుంటే webmaster@kadapa.info కు పంపండి.
ముఖ్యంగా బ్లాగర్లు మీ సహాయమందించండి.
మీరు వార్తలు రాయాలనుకుంటున్నారా?
లేక రచనలు చెయ్యాలనుకుంటున్నారా?
కడప.ఇన్ఫో మీ కోసమే ఎదురు చూస్తోంది.
ఇంకెందుకు ఆలస్యం!
కడప జిల్లాకు సంబంధించిన ఏ అంశాలపైనైనా మీరు కలాన్ని పట్టవచ్చు.
సాహిత్యం పట్ల మక్కువ ఉన్న వారైతే, మీరు చేసిన రచనలు మాకు పంపవచ్చు.
మీ రచనలకు తుది మెరుగులు దిద్డి ప్రచురించే పూర్తి భాద్యతను కడప.ఇన్ఫో స్వీకరిస్తుంది.
మీరు ప్రవాసీయులైతే ఆయా ప్రదేశాలలో జరిగే తెలుగు కార్యక్రమాలను రిపోర్ట్ చెయ్యవచ్చు.
మీరు రచనలను పంపే పక్షంలో editor@kadapa.info కు పంపండి. వార్తలు, సమాచారం పంపదలుచుకుంటే webmaster@kadapa.info కు పంపండి.
ముఖ్యంగా బ్లాగర్లు మీ సహాయమందించండి.
బుధవారం, జూన్ 13, 2007
కడప కథ
కడప కథను గురించి ఎంక్వయిరీ చేస్తున్న సాహితీ ప్రియులకు నమస్కారములు। నాటి నుండి నేటి వరకు కడప జిల్లాకు చెందిన రచయితల క లాలా నుండి జాలువారిన కథల శంకలనం కడప కథ. కడప కథ పుస్తకాలు కొన్నిచోట్ల మాత్రమే పుస్తకాల షాపులలో అందుబాటులో ఉన్నాయి. కడప కథ పుస్తకాలను కడప.ఇన్ఫో ద్వారా విక్రయించే ఏర్పాట్లు చేశామని తెలియచేయటానికి సంతోషిస్తున్నాము. పుస్తకాలు కావలసిన వారు 200 రూపాయలను క్రింది చిరునామాకు పంపండి. పోస్టల్ ఖర్చులు భరించి మేమే పుస్తకాన్ని మీకు పంపుతాం. ఈమెయిల్ ద్వారా కూడా కడప కథను ఆర్డర్ చెయ్యవచ్చు. మీ డ్రాఫ్/చెక్కు/మనియార్డరు వివరాలను తెలుపుతూ webmaster@kadapa.info కు మెయిల్ చేయండి.
మీ ఆర్డర్లు పంపవలసిన చిరునామా:
తవ్వా కమ్యూనికేషన్స్,
13/553-1, స్టేట్ బ్యాంక్ వీధి,
మైదుకూరు-516172,
కడప జిల్లా.
మీ ఆర్డర్లు పంపవలసిన చిరునామా:
తవ్వా కమ్యూనికేషన్స్,
13/553-1, స్టేట్ బ్యాంక్ వీధి,
మైదుకూరు-516172,
కడప జిల్లా.
గురువారం, మే 31, 2007
కాలేజీల సమాచారం
మీ వద్ద కడప జిల్లాకు చెందిన కాలేజీల సమాచారం ఉంటే పంపండి. మీ దగ్గరున్న సమాచారంతో పాటు ఫొటో కూడా పంపితే కడప.ఇన్‌ఫోలో ప్రచురిస్తాం. కడప.ఇన్ఫో లో జిల్లాకు చెందిన అన్ని కళాశాలల సమాచారం ఉచితంగా ఉంచడం జరుగుతుంది. మీ దగ్గరున్న సమాచారాన్ని webmaster@kadapa.info అన్న అడ్రస్‌కు మెయిల్ చేయండి. మీకు మరింత సమాచారం కావాలంటే మా ప్రతినిధులను క్రింది నెంబర్ లలో సంప్రదించండి.
- 9885553979(Hyderabad)
- 09884576494(Chennai)
- 9347398956(Kadapa)
- 9440024471
- 09343768808(Bangalore)
వెబ్ సందర్శకులకు స్వాగతం!
తెలుగు బ్లాగర్లకు స్వాగతం! కడప జిల్లా సమాచారాన్ని సైబర్ జగతికి తెలియచేయడానికి మేము ప్రారంభించిన వెబ్‌సైట్ www.kadapa.info కు నేటిజెన్ల నుండి అపూర్వ స్పందన లభించింది. నేటిజన్ల స్పందనను దృష్టిలో ఉంచుకుని కడప.ఇన్ఫో ను పెద్ద ఎత్తున విస్తరించేందుకు చర్యలు ప్రారంభించాం. ఇక మీదట కడప జిల్లాకు సంబంధించిన సమస్త సమాచారం కడప.ఇన్ఫో లో లభ్యమవుతుంది. ప్రముఖ రచయిత తవ్వా ఓబులరెడ్డి కడప.ఇన్ఫో కు గౌరవ సంపాదకులుగా వ్యవహరిస్తారు. వెబ్ సైట్ విస్తరణలో భాగంగా ఇప్పటికే ఫొరంలు ప్రారంభించడం జరిగింది. డౌన్‌లోడ్స్ విభాగంలో అనేక తెలుగు ఈ-పుస్తకాలు అందుబాటులో ఉంచడం జరిగింది. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పుస్తకాలను ఇక్కడ ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)