గురువారం, డిసెంబర్ 20, 2007

పుష్పగిరి చిత్రాలు

దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్టించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. ఆంధ్ర ప్రదేశ్ లో ఇదొక్కటే శంకరాచార్య మఠం...

పుష్పగిరి శిల్పకళా సౌందర్యం తెలియచేసే చిత్రాలు ఇప్పుడు www.kadapa.infoలో లభ్యం..

http://kadapa.info/pushp_gallery.html

పోతన జన్మస్థలం

కడపజిల్లా సాంస్క­తికోత్సవాలు (డిసెంబరు 20- 23) నిర్వహిస్తున్న సందర్భంగా పోతన జన్మస్థలం, ప్రాంతానికి సంబంధించి చర్చకు తెరలేపుతూ కడప జిల్లా,ఒంటిమిట్ట వాడని కొత్త వాదాన్ని తోడుతున్నారు. ఇరవైశతాబ్దం తొలి దశాబ్దంలోనే కందుకూరి వీరేశ లింగం పంతులు మహాకవి పోతన వరంగల్‌జిల్లా, బమ్మెర గ్రామానికి చెందినవాడని నిర్థారించి కవుల చరి త్ర రచించారు...........

- ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు విభాగం ఆధ్యాపకులు

ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటి?

మరిన్ని అభిప్రాయాలను ఇక్కడ చదవండి.

www.kadapa.info/pothana.html