ఈ రామనాధం యెటువంటివాడో అన్న ప్రశ్న ఆమెకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఔను –
భర్త గుణగణాలమీదే తన జీవితమంతా ఆధారపడి వుంటుంది. అతని స్వభావం మీదనే తన
సుఖశాంతులన్నీ ఆధారపడుతాయి. అతను మంచివాడైతే తన బ్రతుకంతా ఒక పూలపాన్పు.
అతను మంచివాడు కాకపోతే ? – ఐనా, అతను మంచివాని మాదిరే వున్నాడు. తప్పక
మంచివాడే ఐవుంటాడు. లేకపోతే తన అన్నలు తననెందుకు అతనికిచ్చి పెండ్లి
చేస్తారు! ఏమో? మొదట మంచివాళ్ళుగానే వుండి తరువాత యెంతమంది పెండ్లాలను
వేధించుకు తినడం లేదు? ఇతని సంస్కారం ఎటువంటిదో?
The Largest Viewed Website of Kadapa (YSR) District. Kadapa News, Information, Politics, Photos, Videos, Villages, Train Timings, Tourism Spots, Fairs and Festivals and What not?
గురువారం, ఫిబ్రవరి 20, 2014
రాచమల్లు రామచంద్రారెడ్డి ( రా.రా ) కథ 'ఓడిపోయిన సంస్కారం'
గురువారం, ఫిబ్రవరి 13, 2014
ప్రపంచంలోకెల్లా ప్రత్యేక నిక్షేపాలు కడప జిల్లాలో ....
మంగంపేటలో నిక్షేపాలున్నట్లు మొదటగా 1872లో డబ్ల్యు.కింగ్ అనే
బ్రిటీషు అధికారి చేసిన సర్వే ద్వారా వెల్లడయ్యింది. ప్రపంచంలోనే 28శాతం
ముగ్గురాయి (బైరైటీస్) నిక్షేపాలు మంగంపేటలో ఉన్నాయి. భారతదేశంలో లభ్యమయ్యే
ముగ్గురాయిలో 98 శాతం మంగంపేట గనుల నుండే ...
ఆదివారం, ఫిబ్రవరి 09, 2014
గండికోట శ్రీరామచంద్రునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన
కీర్తన సంఖ్య: 165 (19వ రాగిరేకు) రాగం: దేవగాంధారి
ప|| రాజవు
నీకెదురేదీ రామచంద్ర
రాజీవ నయనుడ రామచంద్ర
చ|| వెట్టిగాదు నీవలపు
వింటి
నారికి దెచ్చితిని
(ర)ఱట్టు సేయ బనిలేదు
ఇట్టే రామచంద్ర ..
శనివారం, ఫిబ్రవరి 08, 2014
గండికోట చెన్నకేశవుని స్తుతించిన అన్నమయ్య సంకీర్తన
చెన్నకేశవుని యెడల అపారమైన భక్తిప్రపత్తులు కలిగిన అన్నమయ్య తన
కీర్తనలలో ఆ స్వామిని స్తుతించి తరించినాడు. విజయనగర సామ్రాజ్య కాలంలో
వేలుగులీని హైందవ సంప్రదాయానికీ, సంస్కృతికీ ప్రతీకగా నిలిచిన
గండికోటలో చెన్నకేశవుని ఆలయం ఒకటి ఉండేది. ఈ ఆలయాన్ని దర్శించిన
అన్నమయ్య ఇక్కడి చెన్నకేశవుడిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు… రాగం:
సామంత కీర్తన సంఖ్య: ౩౧౪(314), ౨౭ (27) వ ...
శుక్రవారం, ఫిబ్రవరి 07, 2014
ఏమైనా చేయండి – ఇక్కడ ఇనుము – ఉక్కు పరిశ్రమను మాత్రం కచ్చితంగా స్థాపించి తీరాల్సిందే!
ఖమ్మంజిల్లా బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ నిర్మిస్తామని ఆంధ్రప్రదేశ్
పునర్య్వస్థీకరణ బిల్లులో పేర్కొన్నారు. పనులు మొదలై మధ్యలో నిలిచిపోయిన
బ్రహ్మణిని పూర్తిచేసే అంశాన్ని ఎందుకు చేర్చలేదు?
పోలవరం కడతామంటున్నారు. సీమలో మంచినీళ్లుకూడా లేవు.
ఇక్కడ ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికైనా నిధులు ఇస్తామని ఎందుకు
చెప్పడంలేదు?
మంగళవారం, ఫిబ్రవరి 04, 2014
ఫేస్‌బుక్ లో హల్చల్ చేస్తున్న కొన్ని ఫోటోలు …
ఇక ఇరు పార్టీల శ్రేణులు, అభిమానులు
ఫేస్‌బుక్ వేదికగా ఒకరి పైన మరొకరు పదునైన వ్యాఖ్యలు, పంచ డైలాగ్ లు
వదులుతున్నారు. వీటిలో కొన్ని ఎబ్బెట్టుగా ఉంటే మరికొన్ని నవ్వు
తెప్పించేవిగా ఉంటున్నాయి. వ్యంగాస్త్రాలు, పదునైన మాటల తూటాలతో ఫేస్‌బుక్
వేదికగా జరుగుతున్న ఈ సమరం సార్వత్రిక ఎన్నికలు సమీపించే కొద్దీ మరింత
ఘాటెక్కనుంది.
ఆదివారం, ఫిబ్రవరి 02, 2014
ఈపొద్దు ఇడుపులపాయలో వైకాపా రెండో ప్లీనరీ
ఫిబ్రవరి 2వ తేదీన ఉదయం 8.30 నుంచి 11.30 గంటల వరకు ఎన్నికల పోలింగ్, 11.30
నుంచి 12.30 వరకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మధ్యాహ్నం 12.30 గంటలకు
ఎన్నిక ఫలితాన్ని ప్రకటిస్తారు. రాష్ట్ర స్థాయి విసృ్తత సమావేశం ఓ వైపు
జరుగుతూ ఉండగానే అధ్యక్ష పదవికి పోలింగ్ అవసరమైతే మరో వైపు నిర్వహిస్తారని...
శుక్రవారం, జనవరి 31, 2014
మూడు రోజులకు ముందు సరసోక్తులాడుకొన్న గొంతు మూగబోతే …
“మామా!… ఒక్కసారి నువ్వు క్వార్టర్స్‌కి రా!” తేనెలద్దిన గొంతు నుండి మంద్రస్థాయిలో మధురమైన పిలుపు. మధురస్వరం ఒక వరమైతే ఆ అదృష్టం ఆరవేటిదే! పోద్దుగూట్లో పడబోతున్న వేళ – అప్పుడు ఆరవేటి పిలుపు – ఎందుకో విందుకో అని నవ్వుకుంటూ బయలుదేరాను. నా జీవితంలో అలా స్వతంత్రించి పిలువగలిగిన వాళ్లు చాలా కొద్ది మంది. ఆ కొద్దిమంది....
గురువారం, జనవరి 23, 2014
‘ఫూలోంకి సేజ్’ కాస్తా ‘కాంటోంకీ సేజ్’ అయ్యింది.
అంజలి పిక్చర్స్ బ్యానర్‌లో 1962లో అనుకుంటా! అశోక్ కుమార్, మనోజ్‌కుమార్, వైజయంతిమాల వంటి మేటి తారలతో ‘ఫూలోంకి సేజ్’ (పూలపాన్పు) అనే సినిమా తీశాం. విడుదలయ్యే సరికి అది కాస్తా ‘కాంటోంకీ సేజ్’ (ముళ్ళ పాన్పు) లా తయారయ్యింది. ఆ సినిమా కారణంగా చాలా నష్టపోయాం. ఇండ్రస్టీలో ఎవ్వరూ మమ్మల్ని ఆదుకోలేదు....
పూర్తి వివరాలు ...
ఆదివారం, జనవరి 19, 2014
కేతు విశ్వనాధ రెడ్డి కథ 'కూలిన బురుజు'
ఇది ఊరా? వల్లకాడ? ఈ ఆలోచన రావడంతో ఒళ్ళు జలదరించింది. ఊళ్ళో ఇళ్ళ తలుపులేమో తెరిచి ఉన్నాయి. ఎగువ వీధిలో, ఇండ్ల అరుగుల మీద కూర్చున్న ఒకరిద్దరు ఆడవాళ్ళు నన్ను ఎగాదిగా చూసి ఇంట్లోకి వెళ్ళారు.
ఊరి మధ్య మురారి దండు రోజుల్లో కట్టించిన బురుజు దగ్గరకు వచ్చాను. బురుజు చుట్టూ కట్టిన అరుగు మీద ఎప్పుడూ ఉండే జనం లేరు. బురుజు పైకి చూశాను. సగం పడిపోయింది. పైన పిచ్చిమొక్కలూ… ఒకప్పుడు ఆ బురుజు ఊరి రక్షణకూ, ఐక్యతకూ సంకేతం. ఇప్పుడో?
శుక్రవారం, డిసెంబర్ 27, 2013
వయోలిన్ మీద కమాన్ కర్ర నాట్యంచేస్తుంటే,ద్వారం వారి వయోలిన్ ...
,”బాబుగారు! మీరు ఏమి చదువుకున్నారు?”అని అడిగినప్పుడు చాలా సిగ్గుపడ్డాను.యెందుకంటే,ఆ అ’గణిత’ మేధావి ముందు మనం నిరక్షురలం క్రింద లెక్క వేసుకొనవచ్చు.”మీరు ఏ రోజు పుట్టారు బాబు గారు?”అని అడిగారు. దానికి నేను సమాధానంగా,”శ్రీ వికృతి నామ సంవత్సర మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు,రోహిణీ నక్షత్రంలో జన్మించాను.”అని చెప్పాను.వెంటనే రెండు నిముషాలలోపే,”అంటే, 22 -12 -1950 న,మంగళవారం జన్మించారు” అని చెప్పి ...
బుధవారం, డిసెంబర్ 18, 2013
ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ...
సీమ ప్రాంత సమస్యలు ఏకరువు పెట్టేందుకు నేతలు ఏనాడూ ప్రయత్నించలేదు. సీమలో భారీ పరిశ్రమలు లేవు. విస్తృత రైలు మార్గాలు లేవు. ఉపాధి అవకాశాలు మృగ్యం. రాయలసీమ నుంచి ఒక రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి, ఆరుగురు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ...
శనివారం, డిసెంబర్ 14, 2013
జంతువులను ఆడించినట్లు ...
కొత్తగా ఏర్పడబోయే రాష్ట్రానికి రాజధాని ఎక్కడ? ప్రాంతాల మధ్య నీటి పంపిణీకి ఎలాంటి వ్యవస్థ ఉండాలి? అప్పులు-ఆదాయాల పంపకం ఎలా చేయాలి? అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేసుకోవాలి? యువత విద్యా, ఉపాధి అవకాశాలెలా పెంచాలి?
ఆదివారం, నవంబర్ 17, 2013
బత్తుల ప్రసాద్ కథ 'కుప్పకట్లు'
అవదాన్లయ్య ఈనికి నేనేమి వైద్యం శెప్పినానబ్బ అని కాసేపు ఆలోశన జేసి, ‘ఇంతకు ఏమి వైద్యం శెప్పినానురా’ అనడిగినాడు. ‘అదేంది సోమీ, వారం కిందట నీకాడికి వచ్చి కండ్లు మసకలు మసకలుగా కనపడ్తాండాయి సోమి అనంటే… పొయి జిల్లేడుపాలు పోసుకో పోరా అని జెప్తివి మరిసిపోతివా’ అని నారయ్య జెప్తా వుంటే అవదాన్లయ్య నోరెళ్లబెట్టి సూచ్చాండడు.
‘ఏందిరా నిజ్జంగా జిల్లేడుపాలు కండ్లల్లో పొడ్సుకున్నెవా’....
శుక్రవారం, నవంబర్ 15, 2013
బంగారు నగలు ఏడాదికోమారు దండెంపై ఆరబెట్టేవారట!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)