ఆదివారం, జులై 21, 2013

కేతు విశ్వనాధరెడ్డి గురించి సొదుం జయరాం చెప్పిన సంగతులు

విశ్వాన్ని వెతుక్కుంటూ “ఆంధ్ర రత్న” దినపత్రిక ఆఫీసుకు వెళ్లాను. అక్కడ ఆయన సహాయ సంపాదకుడుగా పనిచేస్తున్నారు. కలుసుకోగానే ఇద్దరికీ ప్రాణం లేచివచ్చింది. ఇద్దరం తిలక్ రోడ్ నుండి నడుచుకుంటూ వచ్చి పబ్లిక్ గార్డెన్స్ లో కూచున్నాం.