గురువారం, అక్టోబర్ 31, 2013

అద్వితీయ ప్రతిభాశాలి

పదిమంది సమూహంలో ఇట్టే పోల్చుకోదగిన ప్రతిభ ఆయనది. చిన్న చిన్న కోనేరులకు, తటాకాలకూ, సరస్సుల కూడిన మహానదికీ ఎటువంటి అంతరం ఉంటుందో తక్కిన రచయితలకూ ఆయనకూ అటువంటి భేదం ఉంటుంది. మర్రిచెట్టుకూ, తక్కిన వృక్షాలకూ ఎటువంటి వ్యత్యాసం ఉంటుందో ప్రౌఢిలో, విస్తీర్ణతలో, ఆయనకూ ఇతర కవులకూ అటువంటి వ్యత్యాసం వుంటుంది.