బుధవారం, సెప్టెంబర్ 18, 2013

గువ్వలచెన్న శతకకర్త ఘటికాశతగ్రంథి పట్టాభిరామన్నది ఊటుకూరు

కైఫీయత్తులో మరో పట్టాభిరామకవి దొరుకుతున్నాడు. ఆయన క్రీ.శ. 1700 ప్రాంతంలో జీవించాడు. కడప జిల్లాకు చెందిన ఊటుకూరు కైఫీయత్తులో ఈ సమాచారం ఉంది. మట్ల తిరువేంగళనాథరాజు ఉరఫ్‌ అప్పయ్యరాజు సాహిత్యాభిమాని. కోడూరు సమీపంలోని ఎర్రగుంట్లకోట కేంద్రంగా పొత్తపినాడు పులుగులనాడు ప్రాంతాల్ని పాలిస్తూ ఉన్నాడు. ఊటుకూరుకు తూర్పుగా ఉన్న రామసముద్రం అనే గ్రామాన్ని పట్టాభిరామ కవికి గ్రాస గ్రామంగా ఇచ్చాడు.